బాయ్‌ ఫ్రెండ్‌ కి బై చెప్పేసిన టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌!

Andhrawatch
1 Min Read

లోక నాయకుడు కమల్‌ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ .. తన నటన , అందంతో వరుస అవకాశాలు అందుకుంటూ టాప్‌ హీరోలతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటుంది శ్రుతి హాసన్‌. అటు తెలుగు, ఇటు తమిళం రెండింట్లో చేతినిండా సినిమాలు ఉన్న సమయంలోనే బాలీవుడ్ లో కూడా ఓ కాలు పెట్టి అవకాశాలు అందిపుచ్చుకుంటుంది.

 నిజానికి శ్రుతి గతంలో నాలుగేళ్ల పాటు ఓ విదేశీయుడుతో ప్రేమలో ఉండి ఒక్కసారిగా  బ్రేకప్ చెప్పేసి అందరికీ షాక్ ఇచ్చింది. కరోనా సమయంలో శంతను అనే మరో వ్యక్తితో ప్రేమలో పడినా ఆమె అనునిత్యం అతనితో కలిసి ఉన్న పోస్టులు పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండేది.

అయితే ఈ మధ్య పరిశీలిస్తే ఆమె సోషల్ మీడియా పోస్టుల్లో  అతని గురించి ప్రస్తావన ఎక్కడా రావడం లేదు. నిజానికి వీరిద్దరూ  సుమారు నాలుగేళ్ల పాటు లివింగ్ రిలేషన్ లో కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు వీరు కలిసి ఉండడం లేదని టాక్‌ నడుస్తుంది. వీరి బంధానికి బ్రేక్ పడిందని ప్రచారం జరుగుతోంది. ఒకరి సోషల్ మీడియా ఖాతాల్ని మరొకరు అన్ ఫాలో చేయడంతో వీరిద్దరూ విడిపోయారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున మీడియాలో జరుగుతోంది. ఒకరకంగా రిలేషన్ కి బ్రేకులు పడినట్లే అని కూడా ప్రచారం సాగుతోంది. 

Share This Article