టాలీవుడ్ పాపులర్ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ వార్తతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. హైదరాబాద్‌లోని నిజాంపేటలోని తన ఇంట్లో నిద్ర మాత్రలు మింగి ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.నిజాంపేటలోని వర్టెక్స్ ప్రీ విలేజ్ గేటెడ్ కమ్యూనిటీ లో నివాసముంటున్న కల్పన ఇంటి నుంచి రెండు రోజులుగా బయటకు రాకపోవడంతో సెక్యూరిటీ అసోసియేషన్ సభ్యులకు ఫిర్యాదు చేశాడు.
అసోసియేషన్ సభ్యులు ఆమె కు కాల్ చేయగా, ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో వారు కల్పన భర్తకు ఈ విషయాన్ని ఫోన్ చేసి వివరించగా.. ఆయన కూడా ఆమెకు ఫోన్ చేసే ప్రయత్నం చేశాడట. కానీ, ఎలాంటి రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది.దీంతో అసోసియేషన్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆమె ఇంటి తలుపులు పగులకొట్టగా, కల్పన స్పృహ తప్పి ఉన్నట్లు గుర్తించారు. వారు వెంటనే ఆమెను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.