పెళ్లి పీటలు ఎక్కబోతున్న టాలీవుడ్ మహానటి..వరుడు ఎవరో తెలుసా!

Thursday, December 18, 2025

టాలీవుడ్‌ ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌ తెలుగులోకి నేను శైలజ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత మహానటి సినిమాతో స్టార్‌ హీరోయిన్‌ గా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత కీర్తి నటించిన అన్ని సినిమాలు ఆల్‌ మోస్ట్‌ హిట్లు అందుకున్నవే. గతేడాది కీర్తి దసరా సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

అయితే గత కొంత కాలం నుంచి కీర్తి సురేష్‌ పెళ్లి చేసుకుంటుందనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు ఇలాంటి వార్తలు తరచూ రావడం వల్ల కీర్తి తండ్రి స్పందించి ఓ క్లారిటీ ఇచ్చాడు. అయినా కానీ కీర్తి పెళ్లి వార్తలు మాత్రం అసలు ఆగడం లేదు.

కీర్తి తన చిన్ననాటి స్నేహితుడితో చాలా సంవత్సరాలుగా ప్రేమాయణం నడుపుతుందని..దీనికి ఇరు కుటుంబాల సభ్యులు అంగీకారం తెలపడంతో అతనిని కీర్తి త్వరలో పెళ్లి చేసుకోబోతుందనే వార్త షికారు చేస్తుంది.

అయితే ఈ వార్తలో  నిజమెంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త  మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇక ఈ విషయం తెలిసిన ఆమె ఫ్యాన్స్ మాత్రం అవన్నీ నిజం కాదని కొట్టిపారేస్తున్నారు. ప్రేమలో ఉంటే.. అధికారికంగా ప్రకటిస్తుంది కదా.. అనవసరంగా కొందరు లేనిపోని పుకార్లు క్రియేట్ చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles