టాలీవుడ్‌ లేడీ సూపర్‌ స్టార్‌ గా ఆ ముద్దుగుమ్మ!

Monday, September 16, 2024

సినీ ప్రపంచంలో హీరోలకు ఉన్నంత లైఫ్ స్పాన్ హీరోయిన్స్ కు ఉండదనే మాట వాస్తవమే. 60 ఏళ్లు పైబడినా కూడా ఇప్పటికి సినిమాలు చేస్తూ కుర్ర హీరోయిన్స్ పక్కన స్టెప్పులు వేస్తున్నారంటే స్టార్ హీరోల ఫ్యాన్ బేస్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.కానీ హీరోయిన్స్ పరిస్థితి ఆలా కాదు. వరుసగా మూడు, నాలుగు సినిమాలు ఫ్లాప్ అయ్యాయంటే ఐరన్ లెగ్ అనే టాక్‌ పడిపోతుంది. దాంతో వారికి అవకాశాలు లేక ఇండస్ట్రీ నుండి తప్పుకోవాల్సిన సిట్యూవేషన్‌ వచ్చేస్తుంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణను కెరీర్ స్టార్టింగ్ లో ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు. తర్వాత కాలంలో స్టార్ హీరోయిన్ గా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న విషయం తెలిసిందే.

గత కొంత కాలంగా తెలుగులో లేడీ సూపర్ స్టార్ పొజిషన్ ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. అనుష్క తర్వాత కాజల్, సమంత కొన్నాళ్ళు ఆ ప్లేస్ భర్తీ చేసినా ప్రస్తుతం వాళ్లు సినిమాలు అరకొర గా చేస్తున్న విషయం తెలిసిందే. అక్కినేని సుశాంత్ హీరోగా వచ్చిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. చూస్తుంటే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ కిరీటాన్ని అందుకునేలా కనిపిస్తుంది.

మీనాక్షి చౌదరి ప్రస్తుతం 6 సినిమాలలో హీరోయిన్ గా యాక్ట్‌ చేస్తుంది. వీటిలో తమిళ స్టార్ హీరో విజయ్ G.O.A.T, దుల్కర్ ‘లక్కీ భాస్కర్’, మెగాస్టార్ ‘విశ్వంభర’, విశ్వక్ మెకానిక్ రాకీ, వరుణ్ తేజ్ ‘మట్కా’, వెంకీ అనిల్ రావిపూడి సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకుంటే మీనాక్షి చౌదరి టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వీటితో పాటు మరో 2 చిత్రాలు చర్చల దశలో ఉన్నట్లు టాక్‌.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles