పెళ్లి పీటలు ఎక్కబోతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌!

Sunday, December 22, 2024

టాలీవుడ్‌ ముద్దుగుమ్మ శ్రద్దా దాస్ తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ పెద్దగా సక్సెస్‌ కాలేకపోయింది. దీంతో పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌ గా నటించి అభిమానులను మెప్పించింది. చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్‌ గా ఉంటూ అభిమానులకు బోలెడు వినోదాన్ని అందిస్తుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు రీఎంట్రీ ఇచ్చి సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా మారిపోయింది. శ్రద్దా దాస్ ఇటీవల ‘పారిజాత పర్వం’ మూవీతో ప్రేక్షకులను అలరించింది.ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధ వ్యక్తిగత విషయాలు తెలిపి అందరినీ ఆశ్యర్చానికి గురి చేసింది. ‘‘ గత కొద్ది కాలంగా నేను పెళ్లి చేసుకున్నానంటూ వార్తలు వస్తున్నాయి. అందులో నిజం లేదు ఇంకా మాకు పెళ్లి కాలేదు. అవును నాకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. నేను ప్రేమలో ఉన్నాను.

అతను తెలుగు ఇండస్ట్రీకి చెందిన నటుడు. నా ఫ్రెండ్స్ అందరికీ ఈ విషయం తెలుసు. కానీ అతను ఎవరు అనేది నేను బయటకు చెప్పాలనుకోవట్లేదు. తొందరలో పెళ్లి కూడా చేసుకుంటాం.ఇప్పటి వరకు నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు. లవ్ లెటర్స్ కూడా ఇచ్చారు కానీ నేను అంగీకరించలేదు. అయితే నేను సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ వాడుతున్నాను. ఆ అకౌంట్ ఏది అనేది చెప్పను.”అంటూ చెప్పుకొచ్చింది.

కానీ తాను ఎవరిని ప్రేమిస్తుందో అతని పేరు రివీల్ చేయలేదు. ప్రస్తుతం శ్రద్దా దాస్ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. అతనెవరా? అని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles