మరోసారి బాలయ్య సినిమా లో టాలీవుడ్‌ చందమామ!

Wednesday, January 22, 2025

నందమూరి నటసింహం బాలయ్య గతేడాది భగవంత్‌ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద హిట్‌ అందుకున్నాడు. ఈ సినిమాని యంగ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య బాబుకు జోడిగా చందమామ కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటించి మెప్పించింది.

అలాగే ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల ముఖ్య పాత్ర పోషించింది.  అనిల్ రావిపూడి ఈ సినిమాకి తనదైన కామెడీ టచ్ ఇస్తూ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ తన క్యూట్ లుక్స్ ఎంతగానో ఆకట్టుకుంది .గత ఏడాది దసరా కానుకగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ “ఎన్‌బికె 109 ” అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది.ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, తెలుగు నటి చాందిని చౌదరి, దుల్కర్ సల్మాన్ మరియు ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీత అందిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా నటిస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించినా కూడా ఆమెది హీరోయిన్‌ పాత్ర కాదని, ఆమె పోలీస్‌ఆఫీసర్‌గా నటిస్తున్నదని సమాచారం. అలాగే ఈ సినిమాలో టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్ కూడా నటించనుందని వినికిడి.అయితే కాజల్‌ ఈ సినిమాలో నెగిటీవ్‌ షేడ్స్‌ ఉండే పాత్ర చేస్తుందని తెలుస్తుంది

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles