మరో స్థాయికి తీసుకుని వెళ్లాలని..!

Sunday, December 22, 2024

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం సినిమా  బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచి రికార్డులు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా థియేట్రికల్ రన్ ను కొనసాగిస్తుంది. ఈ చిత్రం తర్వాత రిలీజైన 35 చిన్న కథ కాదు,   మత్తు వదలరా 2 సినిమాలు కూడా మంచి  సక్సెస్ అందుకున్నాయి.

ఆ విజయాల పై హీరో నాని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరిపోదా శనివారం తర్వాత 35 మూవీ పై మా ప్రేక్షకులు ప్రేమను కురిపించడం, ఈ వారం మత్తు వదలరా 2 చిత్రాన్ని పెద్ద విజయం సాధించడం చూసి వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని తెలిసిపోయింది.

ఈ అద్భుతమైన టీమ్‌లకు అభినందనలు. ఈ నెలాఖరున ఈ ఉత్సాహాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లాలని నా ప్రియమైన ఎన్టీఆర్, కొరటాల శివ గారిని కోరుకుంటున్నాను అని  దేవర చిత్రాన్ని ఉద్దేశించి అన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles