ప్రస్తుతం టాలీవుడ్ మాత్రమే కాదు, ప్రపంచ సినీ ప్రేమికులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం అని చెప్పాలి.
మహేష్ బాబు కెరీర్‌లో 29వ సినిమాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచి అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా నుంచి వచ్చే బిగ్ అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా నుంచి వచ్చే సెన్సేషనల్ అప్‌డేట్‌ను నవంబర్ 16న ప్రత్యేకంగా విడుదల చేయడానికి టీమ్ సిద్ధమవుతోందట. ఆ రోజు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ముఖ్య వివరాలను గ్రాండ్‌గా ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
అయితే దీనిపై అధికారిక నిర్ధారణ మాత్రం ఇంకా వెలువడలేదు. కానీ ఈ నవంబర్ 16న ఏదో పెద్ద సర్ప్రైజ్ అనౌన్స్‌మెంట్ తప్పకుండ రానుందనే ఉత్సాహం ఫ్యాన్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
