వెంకీ మామ ప్రాజెక్ట్‌ కి టైం ఫిక్స్‌!

Wednesday, January 22, 2025

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ హీరోల్లో  వెంకీ మామ ఒకరు . ఆయన హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “సైంధవ్”. కానీ ఈ సినిమా అనుకున్న రేంజ్ లో హిట్ అవ్వలేదు. కానీ వెంకీ నుంచి మాత్రం చాలా కాలం తరువాత ఓ ఎమోషనల్ అగ్రెసివ్‌ పెర్ఫామెన్స్ని మూవీలో చూసినట్లు అనిపించందని ప్రేక్షకుల టాక్‌.

ఈ సినిమా తరువాత వెంకీ నుంచి హిట్‌ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి కాంబోలో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఈ సినిమా గురించి వస్తున్న రూమార్స్ కి చిత్ర బృందం తాజాగా ఫుల్ స్టాప్‌ పెట్టింది. ఈ ఉగాది కానుకగా మంగళవారం సాయంత్రం 5. 49 నిమిషాలకు ఈ సినిమా గురించిన సమాచారం రాబోతుంది.

దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ గురించి మరికాసేపట్లో ఓ క్లారిటీ రానుంది. ఇంతకు ముందే దిల్ రాజు నిర్మాణ సంస్థ ఈ మూవీకి టైం ఫిక్స్ చేసి ఓ హింట్‌ ఇచ్చారు. ఆ హింట్‌ చూస్తే ఈ సినిమా గురించే చెప్పబోతున్నట్లు తెలుస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles