సాలిడ్ నిర్మాణ విలువలతో థ్రిల్లింగ్ గా!

Friday, December 5, 2025

మిల్కి బ్యూటీ తమన్నా మెయిన్ లీడ్ లో దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్ లో రచ్చ సినిమా తర్వాత చేస్తున్న లేటెస్ట్ సినిమానే “ఓదెల 2”. అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కించిన ఈ డివోషనల్ చిత్రం నుంచి మేకర్స్ నేడు మహాకుంభమేళాలో సాలిడ్ టీజర్ కట్ ని 102 ఏళ్ల నాగ సాదు చేతులు మీదగా రిలీజ్ కి తీసుకొచ్చారు.

అయితే ఈ టీజర్ మాత్రం ఇంట్రెస్టింగ్ కట్ తో తీసుకొచ్చారని చెప్పాలి. ఒక పక్క థ్రిల్ చేసే హారర్ ఎలిమెంట్స్ ఇంకో పక్క వాటిని ఎదుర్కొనే దైవ ఎలిమెంట్స్ ని కూడా పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి ఈ టీజర్ లో చూపించడం ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పవచ్చు. అలాగే ప్రతీ కట్ కి కూడా అజనీష్ లోకనాథ్ స్కోర్ ఇంప్రెసివ్ గా ఉంది. ఇక తమన్నా అఘోరిగా సాలిడ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో కనిపిస్తుంది.

అలాగే తనపై పలు సీన్స్ మంచి మాస్ మూమెంట్స్ కూడా బాగున్నాయి. ఇంకా ఈ టీజర్ లో సినిమాటోగ్రఫీ, మేకర్స్ నిర్మాణ విలువలు సాలిడ్ గా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ సినిమా సెటప్ లు మంచి క్వాలిటీ చూపిస్తున్నాయని చెప్పవచ్చు. ఇలా మొత్తానికి మాత్రం ఓదెల 2 టీజర్ ఇంప్రెస్ చేసింది. ఇక ఈ అవైటెడ్ సినిమాని మేకర్స్ పాన్ ఇండియా భాషల్లో త్వరలోనే రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles