ఒకేసారి మూడు సినిమాలు!

Wednesday, January 22, 2025

గత కొంత కాలంగా ప్రభాస్ స్పీడును మరో హీరో ఎవరూ కూడా అందుకోలేకపోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4-5 పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలు లైన్లో పెట్టిన యంగ్‌ రెబల్‌ స్టార్‌… ఒకేసారి మూడు సినిమాల షూటింగ్‌లలో పాల్గొంటుండడం విశేషం. ప్రభాస్ కమిట్ అయిన మూవీల్లో ‘సలార్ 2’ షూటింగ్‌కు కాస్త టైం పట్టేలా ఉంది కానీ.. మిగతా సినిమాలు మాత్రం ఓ రేంజ్‌లో రెడీ అవుతున్నాయి.

ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్‌’ సెట్‌లో ఉన్నారు. ముందుగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి.. హను రాఘవపూడి ప్రాజెక్ట్‌లో జాయిన్ అవ్వబోతున్నట్లు సమాచారం. అందుకే వీలైనంత త్వరగా మారుతిని రాజాసాబ్ పూర్తి చేయాలని డార్లింగ్‌ చెప్పాడని టాక్‌ నడుస్తుంది. అయితే రాజాసాబ్ అవ్వకముందే హను రాఘవపూడి మూవీ షూటింగ్ మొదలు అయిపోయింది. తమిళనాడు మధురైలో ఫస్ట్ షెడ్యూల్‌ మొదలైంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌ లేని సన్నివేశాలను హను చిత్రీకరిస్తున్నారు.

ఓ వారం రోజుల పాటు ఈ షెడ్యూల్‌ జరుగుతుందని సమాచారం. ప్రభాస్ రాజాసాబ్ చిత్ర షూటింగ్ ముగించుకుని ‘ఫౌజీ’లో జాయిన్ కానున్నట్లు సమాచారం. ఈ సినిమా 1945 నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇక మరోవైపు కల్కి 2కి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అయినట్టుగా సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి అయ్యింది. ఇంకా బ్యాలెన్స్ షూటింగ్‌తో పాటు గ్రాఫిక్స్ వర్క్‌ని పూర్తి చేయాలి.

త్వరలోనే ప్రభాస్ కల్కి2 ని కూడా పూర్తి చేయడానికి సిద్దంగా ఉన్నాడంట. ఈ లోపు నాగ్ అశ్విన్ మిగతా వర్క్ కంప్లీట్ చేసుకోనున్నాడు. ఏదేమైనా ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్నవారు ఎవరూ లేరు. ఇది కేవలం ప్రభాస్‌కి మాత్రమే సాధ్యమైందని తెలుస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles