కల్కి సినిమాలో ఆ స్టార్‌ హీరోలు!

Wednesday, June 26, 2024

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న కల్కి 2898 ఏడీ సినిమా గురించి యావత్‌ సినీ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ సినిమా మరో పది రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.

అలాగే అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో యాక్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ చిత్ర బృందం
 ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చేయగా ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది.  అలాగే సోమవారం మేకర్స్ ఈ చిత్రం నుండి భైరవ ఆంథమ్‌ ఆడియో సాంగ్ రిలీజ్ చేసారు.

ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో స్టార్ హీరోస్ దుల్కర్ సల్మాన్ ,విజయ్ దేవరకొండ ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు ఓ వార్త బాగా వైరల్ అవుతుంది. అయితే దీని గురించి చిత్ర యూనిట్‌ మాత్రం అధికారిక ప్రకటన ఏమి విడుదల చేయలేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles