ఈసారి అక్కడ!

Tuesday, January 21, 2025

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా పూర్తి యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా మంచి టాక్‌తో భారీ వసూళ్లను రాబడుతూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. అయితే, ఈ క్రమంలో ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా గురించి ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది.

ఎన్టీఆర్ కెరీర్‌లోని 31వ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తన డైరెక్షన్‌లో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా అధికారికంగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ప్రేక్షకులకు సినిమాకు సంబంధించి ఓ క్లూ వదిలాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇక తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా ఓ పీరియాడిక్ కథగా రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

అంతేగాక, ఈ సినిమా కథ బంగ్లాదేశ్‌లో జరుగుతుందని.. అక్కడ ఉండే తెలుగు వారికి అండగా ఎన్టీఆర్ నిలుస్తాడని.. ఈ నేపథ్యంలో కథ సాగుతుందనే వార్తలు సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కూడా సరికొత్తగా ఉండబోతుందని.. దీన్ని ఇప్పివరకు చూడని విధంగా ప్రశాంత్ నీల్ డిజైన్ చేయబోతున్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి ఎన్టీఆర్-నీల్ కాంబోలో సినిమాపై అప్పుడే బజ్ క్రియేట్ అయ్యేలా వార్తలు వస్తుండటంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles