ఈసారి ఆకట్టుకునే టైటిల్‌ తో వస్తున్న రౌడీ హీరో!

Wednesday, January 22, 2025

యంగ్‌ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కి గత కొంత కాలంగా కాలం కలిసి రావడం లేదనే చెప్పవచ్చు. గతేడాది నుంచి ఏ సినిమా చేసినా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. వరుస అపజయాలు వెంటాడుతున్న విజయ్‌ కి మాత్రం ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ మాత్రం తగ్గడం లేదు. గీతగోవిందం తరువాత విజయ్‌ ఆ రేంజ్‌ హిట్‌ అందుకోలేదనే చెప్పవచ్చు.

మాస్ యాక్షన్‌  డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో నటించిన “లైగర్”మూవీ విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది.లైగర్ మూవీ తరువాత విజయ్ నటించిన ఖుషి మూవీ యావరేజ్ గా నిలిచింది.దీనితో తనకి గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చిన పరుశురాం దర్శకత్వంలో విజయ్ “ఫ్యామిలీ స్టార్” అనే మూవీ చేసాడు.

ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. అయితే ఫ్యామిలీ స్టార్ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ కూడా ఈ సినిమా థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోలేదు.ఇలా వరుస పరాజయాలు పలుకరించినా విజయ్ తో సినిమా చేసేందుకు నిర్మాతలు వెనుకాడటం లేదు . ఫ్యామిలీ స్టార్ తో ప్లాప్ అందుకున్న దిల్ రాజు విజయ్ తో మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా భారీ పాన్ ఇండియా మూవీ అని తెలుస్తుంది.

‘రాజా వారు రాణి గారు’ వంటి సినిమాతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు రవి కిరణ్ కోలా విజయ్ తో తన రెండో సినిమాని చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించబోతున్నారు.అయితే ఈ సినిమాను పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి ‘రౌడీ జనార్దన్’ అనే టైటిల్ ని ఫిక్స్‌  చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ పుట్టిన రోజు అయిన మే 9 న అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles