ఈసారి వేరే!

Wednesday, December 18, 2024

తెలుగు సినిమాలో అనేక జానర్స్‌ లో స్ట్రెయిట్ సూపర్ హీరో సినిమా ఏదన్నా ఉంది అంటే అది “హను మాన్” అని తెలుస్తుంది. సూపర్ హీరో జానర్ కి ఇతిహాసన్ని జోడించి చేసిన ఈ సినిమా భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాని తెలుగు ఆడియెన్స్ సహా పాన్ ఇండియా ఆడియెన్స్ కి అందించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలుగు సినిమా నుంచి మరో కొత్త ప్రయత్నం చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు తను చేస్తుండగా తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఈ అక్టోబర్ 10న మరో అనౌన్స్మెంట్ ని ఇస్తున్నట్లు ప్రశాంత్‌ వర్మ ప్రకటించారు. అయితే ఇది కూడా సూపర్ హీరో సినిమానే అని సినీ వర్గాల్లో ఓ టాక్‌ నడుస్తుంది. కానీ ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఈసారి ఒక ఫీమేల్ సూపర్ హీరో సినిమాని తీసుకురానున్నట్టు సమాచారం.

మరి ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అనేవి ఇంకా తెలియాల్సి ఉంది. మరి రేపు వచ్చే అనౌన్స్మెంట్ ఇదేనా కాదా అనేది ఎదురు చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles