భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రంగా బాహుబలి పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. దర్శకుడు రాజమౌళి విజన్, ప్రభాస్ నటన, మొత్తం టీం కష్టంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా తెలుగు సినిమాకి కొత్త దశను తెచ్చింది. రెండు భాగాలుగా వచ్చిన ఈ గాథను ఇప్పుడు మేకర్స్ ఒకటిగా కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.
ఇటీవల విడుదలైన టీజర్ చూసిన వారంతా అద్భుతమైన అనుభూతిని పొందారు. ముఖ్యంగా గ్రాఫిక్స్, విజువల్స్, బ్యాక్‌డ్రాప్ చూసి అందరి అంచనాలు మరింత పెరిగాయి. పెద్ద తెరపై మళ్లీ ఈ ఎపిక్ కథను చూడటం ప్రేక్షకులకు ఒక ప్రత్యేక అనుభవం అవుతుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి.
అక్టోబర్ 31న ఈ చిత్రాన్ని ఐమాక్స్, 4డిఎక్స్ తో పాటు పలు వెర్షన్‌లలో విడుదల చేయబోతున్నారు.
