కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి రాబోతున్న ప్యాన్ ఇండియా లెవెల్ సినిమా “టాక్సిక్” పై ప్రస్తుతం మంచి హైప్ నెలకొంది. రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి ఫ్యాన్స్ భారీగా ఆసక్తి చూపిస్తున్నారు. కేజీయఫ్ సిరీస్ తర్వాత యష్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అందరి దృష్టి ఈ సినిమా మీదే ఉంది.
చిత్రం షూటింగ్ కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ, యూనిట్ సభ్యులు పనిని వేగంగా పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. ఈ క్రమంలో సెట్స్ నుంచి బయటకు వచ్చిన ఓ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో యష్ షర్ట్ లేకుండా అద్భుతమైన బాడీతో కనిపించినట్టు చెబుతున్నారు. స్టైలిష్ లుక్, రఫ్ యాటిట్యూడ్, అలాగే సిగరెట్ సీన్‌లో ఆయన చూపించిన బాడీ లాంగ్వేజ్ అభిమానుల్లో పూర్వం లేని ఉత్సాహం కలిగించింది.
