అసలు విషయం ఇది!

Tuesday, February 18, 2025

పాన్‌ ఇండియా యంగ్‌ రెబల్‌ స్టార్‌ యాక్ట్‌ చేస్తున్న సినిమాల్లో డైరెక్టర్‌ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్‌ రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా కూడా ఒకటి.ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను మేకర్స్ ఇప్పటికే ఫిక్స్ చేసినట్లుగా సమాచారం. ఇక ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు ఏ వార్త వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా, ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో యాక్ట్‌ చేయబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ సినిమా కథను దర్శకుడు హను రాఘవపూడి తొలుత వేరే హీరోకి చెప్పాడని.. ఆ తర్వాతే ప్రభాస్‌తో ఈ సినిమాను మొదలు పెట్టాడనే  టాక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. డైరెక్టర్‌ హను ఈ సినిమా కథను ముందుగా నేచురల్ స్టార్ నానికి వినిపించాడని వార్తలు బయటకు వచ్చాయి.

అయితే, తాజాగా హను రాఘవపూడి ఈ వార్తలపై ఓ క్లారిటీ ఇచ్చారు. తాను ఈ చిత్రాన్ని ప్రభాస్‌ను దృష్టిలో పెట్టుకునే రాశానని.. ఈ మూవీ కథ షూటింగ్ జరుగుతున్న కొద్దీ డెవలప్ అవుతోందని ఆయన వివరించారు.దీంతో ‘ఫౌజీ’ కథపై వస్తున్న పుకార్లకు డైరెక్టర్ ఫుల్‌స్టాప్ పెట్టాడని చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles