అఖండ 2 కొత్త డేట్‌ ఇదే!

Saturday, December 13, 2025

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న “అఖండ 2 తాండవం” సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. ఇందులో సంయుక్త, అలాగే బాలీవుడ్ కిడ్స్ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇక ఇటీవల రిలీజ్ అయిన టీజర్ మాత్రం అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. విజువల్స్, బీజీఎం, బాలయ్య లుక్ అన్నీ కలిపి ఫ్యాన్స్‌లో హైప్ను రెట్టింపు చేశాయి. మొదటగా సెప్టెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. కానీ తాజా పరిణామాల ప్రకారం అది సాధ్యపడేలా కనిపించడం లేదు.

ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదన్న టాక్ ఉంది. ఈ నేపధ్యంలో విడుదల తేదీపై మళ్లీ చర్చ మొదలైంది. అంతే కాకుండా సెప్టెంబర్‌లో విడుదలకు ఇప్పటికే మరిన్ని సినిమాలు లైన్లో ఉండటంతో పోటీ తప్పకపోవచ్చు. అందుకే మేకర్స్ ఇప్పుడు డిసెంబర్‌ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.

డిసెంబర్‌లో కూడా పోటీ తక్కువేమీ కాదు. తెలుగు నుంచి ‘రాజా సాబ్’, హిందీ బిగ్ హీరోల చిత్రాలు మొదటి వారం నుంచే వరుసలో ఉన్నాయి. కానీ ఆ మధ్య తేదీల్లో గ్యాప్ ఉండటంతో డిసెంబర్ 18 తేదీపై టీమ్ దృష్టి పెట్టిందని సమాచారం.

ఇంతవరకూ ఇవన్నీ సమాచారం మేరకే ఉన్నప్పటికీ, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే బాలయ్య-బోయపాటి కాంబినేషన్ కాబట్టి సినిమా ఎప్పుడు వచ్చినా బాక్సాఫీస్ వద్ద మాస్ హంగామా ఖాయం అనే నమ్మకంతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles