మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇపుడు చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో లేటెస్ట్ గా ఉగాది కానుకగా అనౌన్స్ అయ్యిన చిత్రం మెగా 157 కూడా ఒకటి. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనీల్ రావిపూడితో అనౌన్స్ చేసిన ఈ చిత్రంపై మంచి హైప్ ఆల్రెడీ నెలకొంది. ఇక ఈ సినిమా ఇలా ముహూర్త కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యిందో లేదో అనీల్ రావిపూడి ఈ స్టార్టింగ్ తోనే తన మార్క్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసాడు.
మన టాలీవుడ్ లో అనీల్ రావిపూడి మార్కెటింగ్ ఆడియెన్స్ లోకి స్యూర్ షాట్ గా నచ్చేలా ఉంటుంది. గతంలో సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్ చూసి అంతా ఒకింత ఆశ్చర్యానికి కూడా లోనయ్యారు. మరి ఇదే ఫార్మాట్ లో చిరు సినిమాపై ఓ క్రేజీ వీడియో రిలీజ్ చేశారు. చిరుపై కొన్ని ఐకానిక్ పాత్రలు వాటితో సినిమా మెయిన్ టీమ్ అంతటినీ పరిచయం చేస్తూ ప్లాన్ చేసిన వీడియో మాత్రం సూపర్ ఎంటర్టైనింగ్ గా ఉందని చెప్పాలి.
ఇక ఇందులో మెగాస్టార్ ఎనర్జీ కానీ కామెడీ టైమింగ్ కానీ అదిరిపోయాయి. అలానే లాస్ట్ లో అనీల్ తో ఇది చాలదు అంటూ తన మార్క్ కామెడీ టైమింగ్ తో రఫ్ఫాడించాల్సిందే అంటూ రివీల్ చేసిన ఈ వీడియో మెగా ఫ్యాన్స్ కి మంచి కిక్ అందిస్తుంది. ఇక షూటింగ్ అతి త్వరలోనే స్టార్ట్ కానున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేయగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.