ఇదే హైలెట్ అంట! నందమూరి నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై మరికొన్ని భారీ అంచనాలు అయితే ఏర్పడ్డాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఐతే, ఈ సినిమా పై ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో బాలయ్య ఇంట్రో సీన్ అదిరిపోతుందని.. అఘోర పాత్ర పోషిస్తున్న బాలయ్య, హిమాలయాల్లో శివలింగానికి అభిషేకం చేస్తూ ఆయన పాత్ర రివీల్ అవుతుందని తెలుస్తోంది. ఆ సమయంలో విజువల్స్ నిజంగా అద్భుతంగా ఉంటాయట. కాగా ఈ సినిమా మొత్తంలోనే ఈ ఇంట్రో సీన్ మెయిన్ గా ఉండబోతుందని అంటున్నారు. ప్రస్తుతం హిమాలయాల్లో కొన్ని ప్రదేశాల్లో బాలయ్య అఘోర పాత్ర పై ఈ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.