తాజాగా రిలీజ్ అయిన చిత్రాల్లో శివ కార్తికేయన్ హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్ గా తెరకెక్కిన మదరాసి సినిమా కూడా మంచి అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చింది. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి మొదటి రోజు నుంచే మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. తమిళ్‌లో శివ కార్తికేయన్ కెరీర్‌కి ఈ సినిమా ఓ రేంజ్‌లో సహాయం చేస్తుండగా, తెలుగు వెర్షన్ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.
అయితే ఈ సినిమా గురించి దర్శకుడు చెప్పిన ఓ ఆసక్తికర విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు స్క్రిప్ట్‌లో క్లైమాక్స్ వేరుగా ప్లాన్ చేశానని ఆయన చెబుతున్నారు. మొదట రుక్మిణి వసంత్ పోషించిన మాలతీ పాత్ర చివర్లో మరణించేలా రాసుకున్నానని తెలిపారు. కానీ హీరో తన ప్రియురాలిని కాపాడలేకపోతే కథలోని అసలు భావం దెబ్బతింటుందని భావించి ఆ ఆలోచనను మార్చేశానని వివరించారు.
దాంతో ఆఖరికి మాలతీ పాత్రను బ్రతికేలా చేసి, భావోద్వేగాలకు బలం చేర్చానని చెప్పడం ఆసక్తి రేపుతోంది.
