మామూలు ట్రెండింగ్ కాదిది! టాలీవుడ్ దగ్గర ఈ సంక్రాంతి కానుకగా ప్లాన్ చేసిన సినిమాల్లో ఇప్పటికే రెండు ఆల్రెడీ విడుదలై పోయాయి. ఇక ఈ సినిమాల తర్వాత మోస్ట్ లవబుల్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ “సంక్రాంతికి వస్తున్నాం” కూడా ఒకటి.
కాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటికే పాటలు, ట్రైలర్ లతో మళ్ళీ అనీల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేసేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై మంచి బజ్ నెలకొనగా ఇపుడు సినీ వర్గాల్లో అయితే ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉందనే ట్రెండ్ కనపడుతుంది.
వెంకీ మామ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాకి బుకింగ్స్ మరింత స్ట్రాంగ్ గా కనపడుతుండగా వీటితో సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమాకి కూడా గట్టి ఓపెనింగ్స్ గ్యారంటీ ఉంటాయని తెలుస్తుంది. మరి ఈ అవైటెడ్ సినిమాకి తెలుగు ఆడియెన్స్ ఎలాంటి నంబర్స్ అందించనున్నారో వేచి చూడాల్సిందే.