మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా హిట్ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి గత ఏడాది మన తెలుగు సినిమా నుంచి భారీ గ్రాసర్ చిత్రాల్లో ఒకటిగా ఈ చిత్రం నిలిచి అదరగొట్టింది. ఇక ఈ సినిమాని మేకర్స్ పాన్ ఇండియా రిలీజ్ తర్వాత జపాన్ మార్కెట్ లో కూడా ఇపుడు రిలీజ్ కి తీసుకెలుతున్న సంగతి తెలిసిందే.
జపాన్ లో ఈ మార్చ్ 27న గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండగా అక్కడ ఇపుడు వేసిన పలు ప్రీమియర్స్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనితో దేవర అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్ రిలీజ్ కి ముందే హిట్ కొట్టేసినట్టు జరిగింది అని చెప్పాలి. అలాగే ఈ సినిమాకి సీక్వెల్ ని మేకర్స్ ఈ ఏడాదిలోనే స్టార్ట్ చేయనున్నట్టుగా టాక్.