పుష్ప 2 స్పెషల్‌ సాంగ్ లో మెరుస్తుంది ఈ ముద్దుగుమ్మే!

Monday, September 23, 2024

జాతీయ నటుడు అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబోలో వస్తు్న మోస్ట్‌ అవైటెడ్‌ సినిమా పుష్ప 2. ఈ సినిమా పుష్ప కి సీక్వెల్‌ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు సుకుమార్ పుష్ప 2 సినిమాను ఎక్కడ  కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్‌ వీడియో, పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

’పుష్ప పుష్ప’ అంటూ సాగే ఈ సాంగ్ రికార్డు వ్యూస్ తో అదరగొడుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ప్రోమోను చిత్ర బృందం విడుదల చేశారు. కపుల్ సాంగ్ గా రానున్న ఈ సాంగ్ ను “మే 29 ” ఉదయం 11 గంటల 7 నిమిషాలకు విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ఉండనున్నట్లు టాక్‌. పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఊ అంటావా మావా అంటూ సమంత వేసిన స్టెప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

అయితే పుష్ప 2 సినిమాలో కూడా అదిరిపోయే ఐటెం సాంగ్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అయితే ఐటెం సాంగ్ కోసం చాలా మంది హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. తాజాగా యానిమల్ బ్యూటీ ‘తృప్తి డిమ్రి ‘ పేరు తెరమీదకు వచ్చింది. యానిమల్ సినిమాతో స్టార్ గా మారిన ఈ భామకు అవకాశాలు క్యూ కడుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles