ఈ క్లైమాక్స్ చాలా ఖరీదైనది గురూ!

Andhrawatch
1 Min Read

ఇండియన్ సినిమాలో ఏ ఒక్క సినిమా ప్రత్యేకంగా కనిపించినా, దాన్ని దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇక యాక్షన్ సినిమాల విషయంలో ఈ ఆదరణ మరింత పెరుగుతుందనే విషయం తెలిసిందే. అయితే, బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘సింగం’ సిరీస్ సినిమాలకు యావత్ దేశవ్యాప్తంగా ఎలాంటి ఆదరణ దక్కిందో మనం చూస్తునే ఉన్నాం. అజయ్ దేవగన్‌  పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆ సినిమాలో చేసిన యాక్షన్‌కి ప్రేక్షకులు పట్టం కట్టిన విషయం తెలిసిందే.

దర్శకుడు రోహిత్ శర్మ డైరెక్షన్‌లో ఇప్పుడు ‘సింగం అగైన్’ అనే సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో మరోసారి అజయ్ దేవగన్‌ తనదైన యాక్షన్‌తో ఆకట్టుకోనున్నాడు. అయితే, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలోని క్లైమాక్స్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం ఏకంగా రూ.25 కోట్లను ఖర్చు పెడుతున్నారట మూవీ మేకర్స్‌.

ఈ సినిమా బడ్జెట్ రూ.250 కోట్లు కాగా, కేవలం క్లైమాక్స్‌కే ఇంత బడ్జెట్ పెడుతుండడంతోఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇండియన్ సినిమాలోనే ఇది అత్యంత ఖరీదైన క్లైమాక్స్‌గా మారిందని సినీ సర్కిల్స్‌లో చర్చ జోరుగా సాగుతోంది.

Share This Article