స్పిరిట్ కోసం తీసుకున్నారంట..కానీ!

Friday, December 5, 2025

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలను తెరకెక్కిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇప్పటికే ఆయన ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలను వరుసగా రిలీజ్‌కు రెడీ చేసేందుకు ప్లా్న్ చేస్తున్న ప్రభాస్ ఆ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమాలో నటిస్తాడు.

అయితే, ‘స్పిరిట్’ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పలు వార్తలు సినీ వర్గాల్లో షికారు చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఓ టాక్ జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొనేను తీసుకున్నారని.. అయితే, కొన్ని కారణాల వల్ల ఆమెను ఈ సినిమా నుంచి తప్పించారని కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles