కిసిక్’ సాంగ్ పాడింది వీరే.. !

Tuesday, December 24, 2024

టాలీవుడ్‌లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ సినిమా ‘పుష్ప-2’ డిసెంబర్ 5న గ్రాండ్ విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా నుండి తాజా అప్డేట్‌ గా ‘కిసిక్’ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేస్తున్నారు.

ఈ సాంగ్ డ్యాన్స్ నెంబర్‌గా వస్తుండటంతో ఈ పాట ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఈ పాట చాలా హైలైట్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.  కాగా, ఈ పాటను ఎవరు పాడారనే విషయంపై మేకర్స్ తాజాగా ప్రేక్షకులకు ఓ క్లారిటీ ఇస్తున్నారు. ‘కిసిక్’ సాంగ్‌ని తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సింగర్ సుభాషిణి తన గొంతును వినిపించగా.. హిందీలో సుభాషిణి, లోతిక ఝా.. మలయాళంలో ప్రియా జెర్సన్.. బెంగాలీలో ఉజ్జయినీ ముఖర్జీ పాడారు.

ఇలా పలు భాషల్లో ఈ పాటకు సంబంధించిన సింగర్స్‌ను పరిచయం చేస్తూ ‘పుష్ప-2’ మేకర్స్ ఈ పాటపై మరింత హైప్ ని క్రియేట్‌ చేస్తున్నారు. ఇక ఈ ‘కిసిక్’ పాటలో అల్లు అర్జున్‌తో పాటు యంగ్ బ్యూటీ శ్రీలీల అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు వేసిందని చిత్ర యూనిట్ ఎప్పుడో చెప్పింది. ఈ పాటను నవంబర్ 24న సాయంత్రం 7.02 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles