అవన్నీ తెలియక చేసిన తప్పులు!

Sunday, December 22, 2024

సమంత…ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ భామ విజయ్‌ దేవరకొండతో కలిసి చివరిసారిగా తెలుగు ప్రేక్షకులను ఖుషి సినిమాతో పలకరించిన ఆవిడ తరువాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. ఖుషి సినిమా యావరేజ్‌ టాక్ రావడంతో ఆమె కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉంటుంది.

ఇకపోతే ప్రస్తుతం ఆమె నటించిన సిటాడెల్ ఇండియన్‌ వెర్షన్‌ వెబ్ సిరీస్‌ రిలీజ్ కావడానికి సిద్దంగా ఉంది. ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోకస్ మొత్తం బాలీవుడ్‌ పైనే ఉందని టాక్‌ వినిపిస్తుంది. ఇక టాలీవుడ్‌ లేదు దక్షిణ భారతదేశ చిత్ర పరిశ్రమల్లో అయితే కేవలం ఫిమేల్‌ సెంట్రిక్‌ కథలు మాత్రమే చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందని టాక్‌.

ఒకవేళ అది కుదరకపోతే కేవలం పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు మాత్రమే ఎదురు చూస్తుందట.ఖుషి సినిమాను పూర్తి చేసి సినిమా అనంతరం కొద్ది కాలం పాటు సినిమాలకు విరామం ఇచ్చింది. అయితే కేవలం మానసిక ప్రశాంతత కోసం బ్రేక్‌ ఇచ్చినట్లు సమాచారం. సామ్ గత కొంతకాలంగా ఆరోగ్యానికి సంబంధించిన టిప్స్ ఇస్తుంది.

అయితే ఈ క్రమంలోనే ఓ అభిమాని ఓ కామెంట్‌ చేశాడు. ఇప్పుడు ఇవన్నీ మంచిగా బానే చెబుతున్నారు.  కాకపోతే..గతంలో మీరు అనారోగ్యకరమైన బ్రాండ్స్ ను ప్రమోట్‌ చేశారు కదా.. అందుకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించగా..దీని గురించి సమంత రియాక్ట్ అయ్యింది. ఇది వరకు తాను తప్పులు చేసిన మాట వాస్తవమేనని ..అయితే అది పూర్తిగా తెలియక చేసినపని మాత్రమే అంటూ సమంతా చెప్పుకొచ్చింది. అలాంటి వాటిని పూర్తిగా ఆపేసినట్లు సమంత పేర్కొంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles