గద్దర్‌ సినిమా అవార్డుల విజేతలు వీరే!

Friday, December 5, 2025

తెలుగు రాష్ట్రాలలో సినిమాల రంగానికి సంబంధించిన వివిధ అవార్డులు ఉంటూనే ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ పురస్కారాలు కూడా ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ అవార్డులు ప్రముఖ విప్లవ గేయ రచయిత గద్దర్ పేరుతో పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం జూన్ 14న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులు అందజేయనున్నారు. ఈ వేడుకలో ఈసారి ఏ సినిమాలు ఏఏ విభాగాల్లో గద్దర్ పురస్కారాలు పొందాయో చూద్దాం.

వివిధ ఫీచర్ ఫిల్మ్ విభాగాల్లో ఉత్తమ చిత్రం ‘కల్కి 2898 ఏడి’గా ఎంపికైంది. రెండవ ఉత్తమ చిత్రం ‘పొట్టేల్’ కాగా, మూడవ ఉత్తమ చిత్రం ‘లక్కీ భాస్కర్’. జాతీయ సమగ్రతకు సంబంధించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’కు పురస్కారం లభించింది. పిల్లల చిత్రాలలో ‘35 చిన్న కథ కాదు’ను ఎంపిక చేశారు. పర్యావరణం, వారసత్వం, చారిత్రాత్మక అంశాలపై ‘రజాకార్’ చిత్రానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. తొలి దర్శకుడిగా శ్రీ యెదు వంశీ ‘కమిటీ కుర్రోళ్లు’కి ఉత్తమ దర్శకుడిగా గుర్తింపు పొందారు. వినోదాత్మక చిత్రం విభాగంలో ‘ఆయ్… మేమ్ ఫ్రెండ్స్ అండి’ను ఎంపిక చేశారు.

వ్యక్తిగత రంగంలో నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 AD’కి ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ‘పుష్ప 2’తో గుర్తింప పొందారు. ఉత్తమ నటి గా నివేతా థామస్ ‘35 చిన్న కథ కాదు’ చిత్రానికి గౌరవం దక్కింది. ఉత్తమ సహాయ నటుడిగా ఎస్‌జే సూర్య ‘సరిపోదా శనివారం’లో మెరిశారు. ఉత్తమ సహాయ నటి గా శరణ్య ప్రదీప్ ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ చిత్రానికి అవార్డు పొందారు. ఉత్తమ సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరోలియో ‘రజాకార్’కు గుర్తింపు దక్కింది.

ఉత్తమ నేపథ్య గాయకుడిగా సిద్ శ్రీరామ్ ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రం లోని పాటకు గుర్తింపు పొందగా, ఉత్తమ నేపథ్య గాయని గా శ్రేయా ఘోషల్ ‘పుష్ప 2’ చిత్రంలో తన పాటతో అభినందన పొందింది. హాస్య నటనకు సత్య మరియు వెన్నెల కిషోర్ ‘మత్తు వదలారా 2’లో ఉత్తమ అవార్డులు అందుకున్నారు. బాల నటులుగా అరుణ్‌దేవ్ పోతుల ‘35 చిన్న కథ కాదు’ మరియు హారిక ‘మెర్సీ కిల్లింగ్’కి గుర్తింపు లభించింది. కథా రచయితగా శివ పాలడుగు ‘మ్యూజిక్ షాప్ మూర్తి’కు, స్క్రీన్ ప్లే రచయితగా వెంకీ అట్లూరి ‘లక్కీ భాస్కర్’కి పురస్కారాలు అందాయి.

అలాగే ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్ ‘రాజు యాదవ్’ చిత్రానికి, సినిమాటోగ్రాఫర్ గా విశ్వనాథ్ రెడ్డి ‘గామి’కి, ఎడిటర్ గా నవీన్ నూలి ‘లక్కీ భాస్కర్’కి, ఆడియోగ్రాఫర్ గా అరవింద్ మీనన్ ‘గామి’కి గుర్తింపు లభించింది. ఉత్తమ కొరియోగ్రాఫర్ గా గణేష్ ఆచార్య ‘దేవర’లోని “ఆయుధ పూజ”కి అవార్డు దక్కింది. కళా దర్శకత్వం లో అద్నితిన్ జిహాని చౌదరి ‘కల్కి 2898 AD’కి, యాక్షన్ కొరియోగ్రాఫర్ గా కె చంద్ర శేఖర్ రాథోడ్ ‘గ్యాంగ్‌స్టర్’కు, మేకప్ ఆర్టిస్ట్ గా నల్ల శ్రీను ‘రజాకార్’కు, కాస్ట్యూమ్ డిజైనర్లుగా అర్చనరావు మరియు అజయ్ కుమార్ ‘కల్కి 2898 AD’కి పురస్కారాలు అందాయి.

ప్రత్యేక జ్యూరీ అవార్డుల్లో దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ కోసం, అనన్య నాగల్ ‘పొట్టేల్’కి, సుజిత్ మరియు సందీప్ ‘క’కి, ప్రశాంత్ రెడ్డి మరియు రాజేష్ కల్లేపల్లి ‘రాజు యాదవ్’కి ప్రత్యేక గుర్తింపులు లభించాయి. జ్యూరీలో ప్రత్యేక ప్రస్తావన ఫరియా అబ్దుల్లా ‘మత్తు వదలారా 2’లోని “డ్రామా నక్కో మామా – రాప్”కి వచ్చింది.

తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ఉత్తమ సాహిత్య పుస్తకంగా ‘మన సినిమా ఫస్ట్ రీల్’ అనే పుస్తకం ఎంపిక అయింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles