అందులో తప్పేం లేదు!

Friday, December 5, 2025

టాలీవుడ్‌లో ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా   ‘మజాకా’. ఈ సినిమా టీజర్‌ను తాజాగా లాంచ్ చేశారు మూవీ మేకర్స్. సందీప్ కిషన్, రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో ‘మన్మథుడు’ మూవీ బ్యూటీ అన్షు కూడా యాక్ట్‌ చేస్తోంది. అయితే, ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ త్రినాథరావు చేసిన కామెంట్స్ పలు విమర్శలకు దారి తీశాయి.

హీరోయిన్ అన్షు పై త్రినాథరావు చేసిన కామెంట్స్‌పై నెట్టింట ట్రోల్‌ అవుతుంది. దీంతో ఆయన ఎలాంటి దురుద్దేశంతో ఈ కామెంట్లు చేయలేదని.. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అలా అన్నానంటూ క్షమాపణలు కోరారు త్రినాథరావు. ఇక తాజాగా త్రినాథరావు చేసిన కామెంట్స్‌పై అన్షు కూడా మాట్లాడింది. ‘మజాకా’ టీజర్ లాంచ్‌లో ఎలాంటి వివాదం జరగలేదని.. కేవలం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే డైరెక్టర్ మాట్లాడారని.. ఆయన చాలా మంచి వ్యక్తి అని అన్షు తెలిపింది.

ఇక ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని.. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత కూడా తనపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు థాంక్స్ అంటూ అన్షు ఓ వీడియోను విడుదల చేసింది. దీంతో ఈ వివాదానికి ఇక ఫుల్‌స్టాప్ పడుతుందని ‘మజాకా’ చిత్ర యూనిట్ అనుకుంటుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles