తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమా కూలీ బాక్సాఫీస్ వద్ద బాగానే దూసుకెళ్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదట మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నా, థియేటర్లలో మాత్రం నిలకడగా ఆడుతోంది. ప్రేక్షకులలో ఉన్న భారీ అంచనాలు వసూళ్ల రూపంలో కనపడుతున్న సంగతి తెలిసిందే.
ప్రత్యేకంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమాపై క్రేజ్ మరింత ఎక్కువగా ఉంది. అందుకే విడుదలైన తొలి రోజే భారీ కలెక్షన్లు సాధించింది. ఆ తర్వాత కూడా ఆ వసూళ్లు నెమ్మదిగా కొనసాగుతూ ఉన్నాయి.
ఇదిలా ఉంటే, కూలీకి మరో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అమెరికాలోని న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో ఈ సినిమా పోస్టర్ ప్రదర్శించడం ద్వారా అరుదైన గౌరవం దక్కింది. సాధారణంగా చాలా తక్కువ చిత్రాలకు మాత్రమే ఇలాంటి అవకాశాలు వస్తాయి.
