తారక్ -నీల్‌ సినిమా పై అప్‌డేట్‌ వచ్చేసింది!

Sunday, December 22, 2024

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా హిట్‌ తరువాత జూనియర్‌ ఎన్టీఆర్‌ రాబోయే సినిమాలు వేరే లెవల్లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఆయన ప్రస్తుతం దేవర సినిమాతో మరో 48 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు చిత్ర బృందం వివరించిన సంగతి తెలిసిందే.దేవరలో తారక్‌ డబుల్‌ రోల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

పవర్ ఫుల్ కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. దీంతో పాటుగా తారక్‌ వార్ 2 లోనూ యాక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు తారక్‌.  ఈ సినిమలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో తలపడనున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా భాషలలో తెరకెక్కిస్తున్నారు మూవీ మేకర్స్. వీటితో పాటు మరో సినిమాను కూడా మొదలు పెట్టేశాడు తారక్.

కేజీఎఫ్ సిరీస్ తో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌ లో జూనియర్‌ ఎన్టీఆర్ యాక్ట్‌ చేయబోతున్నాడు. నేడు ఈ సినిమాకి రామ నాయుడు స్టూడియో అతి కొద్ది మంది సమక్షంలో పూజ కార్యక్రమాలు నిర్వహించారు. దాంతో పాటు ఈ సినిమా విడుదల తేదీని కూడా  ప్రకటించింది నిర్మాణ సంస్థ.

సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఈ ఏడాది సెప్టెంబరు 27న దేవర విడుదల కానుంది. 2025లో తారక్ నటించిన వార్ -2 రానుంది. 2026 ప్రశాంత్ నీల్ సినిమా. ఎన్టీఆర్,నీల్ సినిమాను మైత్రీ మూవీస్, ఎన్టీయార్ ఆర్ట్స్ పై కళ్యాణ్ రామ్, నవీన్, రవి శంకర్ సంయుక్తంగా నిర్మిచబోతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles