బాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమాల్లో ముందున్నది రామాయణ. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. అలాగే యష్, కాజల్ అగర్వాల్, సన్నీ డియోల్ వంటి టాప్ స్టార్‌లు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్‌తో, అద్భుతమైన టెక్నికల్ విలువలతో తెరకెక్కుతోంది.
ఇప్పటికే ఈ సినిమా గురించి ఎన్నో రూమర్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వానరసేన ఎపిసోడ్స్ కోసం హాలీవుడ్‌లోని ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ తరహా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ టెక్నిక్ వలన గ్రాఫిక్స్ చాలా రియలిస్టిక్‌గా ఉండబోతున్నాయనే అంచనాలు ఉన్నాయి.
అయితే ఇదే తరహా మాటలు గతంలో ఆదిపురుష్ సినిమా సమయంలో కూడా వినిపించాయి. ఆ సినిమా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో అవతార్ స్థాయిలో చేస్తామని అప్పట్లో మేకర్స్ చెప్పిన సంగతి గుర్తుంది. కానీ ఫలితం మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా వానరసేన విజువల్స్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.
ఇప్పుడు రామాయణకు 4000 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారని సమాచారం. ఈ స్థాయి ఖర్చుతో వచ్చే విజువల్స్ తప్పకుండా నేచురల్‌గా ఉండాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఆదిపురుష్ లాంటి తప్పిదాలు రిపీట్ కాకుండా ఈసారి నిజమైన ఎపిక్ అనుభూతి ఇవ్వగలరా అన్నది ఇప్పుడు అందరికి కుతూహలంగా మారింది.
