అప్పుడు పుష్ప 2..ఇప్పుడు జాక్‌!

Andhrawatch
1 Min Read

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘పుష్ప 2’ బాక్సాఫీస్ దగ్గర ఎన్నో సెన్సేషన్స్‌  క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమాకు మేజర్ అసెట్‌గా ఈ చిత్ర బీజీఎం నిలిచిందని చెప్పుకోవచ్చు. ఈ చిత్రానికి సామ్ సి.ఎస్ బీజీఎం వర్క్ అందించాడు. ఆయన చేసిన మ్యూజిక్‌కు మంచి గుర్తింపు లభించింది.

ఇక ఇప్పుడు మరోసారి తన బీజీఎం వర్క్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సామ్ సి.ఎస్ రెడీ అవుతున్నాడు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాక్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నాడు. అయితే, ఈ సినిమాకు బీజీఎం అందించేందుకు సామ్ సి.ఎస్ తాజాగా చిత్ర యూనిట్‌లో జాయిన్ అ
యినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

‘పుష్ప-2’లోని తన వర్క్ కారణంగా ఇప్పుడు ‘జాక్’లో ఛాన్స్ రావడంపై సామ్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. మరి ఈ చిత్రానికి ఆయన ఎలాంటి బీజీఎం ఇవ్వనున్నాడో వేచి చూడాలి.

Share This Article