తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ వివాదం ఇప్పుడు పెద్ద చర్చకీ కేంద్రంగా మారింది. ఈ అంశం మీద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన చెప్పిన ప్రకారం, సినిమా రంగంలో ఉండే కొందరు వ్యక్తులు, తమ చేతుల్లో ఉన్న థియేటర్లను బంద్ చేయించేందుకు వెనకుండి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రలు వల్ల సినిమారంగానికి నష్టమవుతోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవలే పవన్ కళ్యాణ్ ఈ అంశంపై ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తూ ఒక లేఖను విడుదల చేశారు. థియేటర్ల నిర్వహణపై స్పష్టమైన విధానాలు ఉండాలన్నది ఆయన అభిప్రాయం. మరోవైపు, ఈ వివాదంలో జనసేన పార్టీకి చెందిన రాజమండ్రి నగర నియోజకవర్గ ఇంచార్జి, డిస్ట్రిబ్యూటర్ అత్తి సత్యనారాయణపై వచ్చిన ఆరోపణల కారణంగా, పార్టీ అతన్ని సస్పెండ్ చేస్తూ అధికారికంగా ప్రకటన చేసింది.
ఇంకా, థియేటర్ల బంద్ వెనక ఉన్న కారణాలను పరిశీలించేందుకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇప్పటికే విచారణ ప్రారంభించారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాలను ఆయన పవన్ కళ్యాణ్‌కు వివరించారు. మొత్తం మీద, ఈ సమస్య చుట్టూ ఉహలు, వాదనలు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఏదైనా పరిష్కారం వస్తుందేమో చూడాలి.
