ఆయన నుంచి ఫుల్‌ పాజిటివిటీనే నేర్చుకున్న అంటున్న యంగ్‌ హీరో!

Andhrawatch
1 Min Read

మెగా కంపౌండ్‌ హీరో అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బడ్డీ’ ఆగస్టు 2న థియేటర్లలో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఎలాగైన  హిట్ కొట్టాలని అల్లు శిరీష్ గట్టి పట్టుదల మీద ఉన్నాడు.  తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ ఎంతో ఘనంగా నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి గురించి హీరో అల్లు శిరీష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పవన్ కళ్యాణ్ నుంచి మెంటల్ స్ట్రెంగ్త్‌ను.. మెగాస్టార్ చిరంజీవి నుంచి అన్‌లిమిటెడ్ పాజిటివిటీలను నేర్చుకున్నట్లు శిరీష్‌ చెప్పుకొచ్చాడు. అంతేగాక, తన తండ్రి అల్లు అరవింద్ ఒక రోబో లాగా పని చేస్తారని వివరించారు. ఉదయం టీ తాగే సమయం నుండి రాత్రి వరకు తన షెడ్యూల్‌ను తుచా తప్పకుండా ఫాలో అవుతారని చెప్పాడు. స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మించిన ‘బడ్డీ’ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు.

Share This Article