నా కెరీర్ లో అతి చెత్త సినిమా అదే..నయన్‌ షాకింగ్‌ కామెంట్స్!

Andhrawatch
1 Min Read

అటు టాలీవుడ్‌, ఇటు కోలీవుడ్ లో  లేడీ సూపర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు లో అగ్ర హీరోలందరి సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది.  

గతేడాది షారుఖ్ ఖాన్ సరసన జవాన్ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.

ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది. తమిళంతో పాటూ కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తోన్న ఈ హీరోయిన్ సూర్య – మురుగదాస్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘గజిని’ పై షాకింగ్ కామెంట్లు చేసింది.

2005లో వ‌చ్చిన ‘గజిని’ మూవీ సూర్య కెరీర్‌లోనే అతి పెద్ద హిట్ అందుకుంది. ఇందులో ఆసిన్ తో పాటూ నయన్‌ మరో హీరోయిన్ గా నటించింది ఇందులో చిత్ర అనే డాక్ట‌ర్ పాత్ర‌లో న‌య‌న్ కనిపించింది. అయితే ఈ పాత్ర త‌న మూవీ కెరీర్లోనే అత్యంత చెత్త ఎంపిక‌ అంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -

తాను ఇప్ప‌టివ‌ర‌కు చేసిన సినిమాల‌లో గ‌జిని సినిమానే అత్యంత వరస్ట్ సెలెక్షన్ అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాలో న‌టించినందుకు ఇప్ప‌టికి కూడా బాధపడుతుంటానని… ఈ మూవీలో త‌న పాత్ర‌ను మూవీ మేకర్స్‌ చెప్పిన‌ట్లుగా చిత్రీక‌రించ‌లేదని, తనను చెత్త‌గా ఫోటోలు తీశారంటూ వివరించింది. దీంతో నయన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Share This Article