సూపర్ స్టార్ రజినీకాంత్, కింగ్ నాగార్జున కలిసి చేసిన సినిమా ‘కూలీ’ థియేటర్లలో సంచలనాన్ని సృష్టిస్తోంది. విడుదలకు ముందు నుంచే భారీ హైప్ తో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా, మొదటి వారాంతంలోనే దాదాపు రూ.380 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ సాధించింది. ముఖ్యంగా మిశ్రమ సమీక్షలు వచ్చినా, ఇంత పెద్ద స్థాయి వసూళ్లు రాబట్టడం విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం.
ప్రేక్షకులలో ఈ సినిమాపై ఉన్న ఆసక్తి బుకింగ్స్ సమయంలోనే స్పష్టమైంది. టికెట్ కౌంటర్ల దగ్గర భారీ డిమాండ్ ఏర్పడి, మొదటి రోజే రికార్డు స్థాయి ఓపెనింగ్ సాధించింది. డే వన్ లోనే 100 కోట్లకు పైగా వసూలు చేసి తమిళ సినిమాల్లో టాప్ ఓపెనర్ గా నిలిచింది.
ఈ చిత్రంలో రజినీకాంత్, నాగార్జునలతో పాటు ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, రెబా మోనికా జాన్, జూనియర్ ఎంజీఆర్, మోనిషా బ్లెస్సీ వంటి నటులు ముఖ్య పాత్రలు పోషించారు. పూజా హెగ్డే ఒక ప్రత్యేక గీతంలో కనిపించగా, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.
