ట్రైలర్‌ తోనే అందరికీ సమాధానం!

Friday, December 5, 2025

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా ఫాంటసీ చిత్రం “విశ్వంభర”పై ప్రేక్షకుల్లో ఆసక్తి కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా, మళయాల దర్శకుడు వశిష్ఠ మెగాఫోన్ పట్టారు. చిరు నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న ఫాంటసీ బేస్డ్ సినిమా కావడంతో అభిమానుల అంచనాలు భారీగా పెరిగాయి.

గతేడాది దసరా సందర్భంగా రిలీజ్ అయిన మొదటి గ్లింప్స్‌కి మిశ్రమ స్పందన వచ్చింది. సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్స్ చేశారు కూడా. అయితే ఇప్పుడు దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పటి ట్రోల్స్‌కి సమాధానం లాంటి ట్రైలర్ వచ్చేలా ఖచ్చితంగా ప్లాన్ చేశామంటూ ఆయన చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఈసారి కథ, విజువల్స్, ఎమోషన్స్ అన్నీ కలిపి ప్రేక్షకుల్ని మెప్పించేలా ట్రైలర్ కట్ చేసినట్టు సమాచారం. అందులోనూ గ్లింప్స్‌కు వచ్చిన నెగెటివ్ కామెంట్లను దృష్టిలో పెట్టుకొని మరింత పక్కాగా నిర్మాణ విలువలతో పని చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ చిత్రానికి సంగీతం మెలోడి మాస్టర్ ఎం ఎం కీరవాణి అందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. టెక్నికల్ టీమ్ నుంచి సంగీతం, విజువల్ ఎఫెక్ట్స్ వరకు అన్నింటికీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సినిమా యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

మొత్తంగా ట్రోల్స్‌కు తావు లేకుండా, ఈసారి మాత్రం మెగా మాయాజాలాన్ని నిజంగా అనిపించేలా ట్రైలర్ రావాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles