ట్రైలర్ వచ్చేది అప్పుడే! టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సంక్రాంతి సినిమాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పటికే ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా దగ్గరయ్యింది. ఈ సినిమాతో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో మరోసారి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడం ఖాయమని అభిమానులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఇక వారి అంచనాలను అందుకునే విధంగా ఈ మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సోమవారం రోజున నిజామాబాద్‌లో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం అయ్యింది. ఈ ఈవెంట్‌కు చిత్ర యూనిట్ మొత్తం హాజరు అయ్యింది.
అయితే, ఈ ట్రైలర్‌ను డిజిటల్ మాధ్యమంలో రాత్రి 8.01 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన విషయం తెలిసిందే.