‘బాలయ్య 109’ టైటిల్… ఓ విషయం చెప్పిన నిర్మాత!

Sunday, December 22, 2024

ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అవైటెడ్ సినిమా  గురించి  అందరికీ  తెలిసిందే. తన కెరీర్ లో 109వ సినిమాని దర్శకుడు బాబీ ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా స్టార్ట్ చేసిన నాటి నుంచి ఇప్పుడు వరకు కూడా సినిమా టైటిల్ ని చాలా గోప్యంగా ఉంచారు మేకర్స్‌.

 అయితే ఫైనల్ గా ఈ టైటిల్ ని ఓ సాలిడ్ టీజర్ తో ఈ దీపావళికి అనౌన్స్ చేస్తున్నట్టుగా నిర్మాత నాగవంశీ చాలా రోజుల క్రితమే ఓ క్లారిటీ ఇచ్చారు.  కానీ ఇప్పుడు దీనిపై ఓ డిజప్పాయింటింగ్ న్యూస్ ని అయితే తాను షేర్ చేసారని చెప్పాలి. తాము ఈ సినిమా టైటిల్ ని సాధారణంగా జస్ట్ పోస్టర్ వేసి వదిలేయకూడదు అనుకున్నామని… ఆ టైటిల్ కి పర్ఫెక్ట్ వీడియోతో అనౌన్స్ చేస్తే బాగుంటుంది అని దర్శకుడు మేము అనుకున్నాం.

అయితే దాని తాలూకా సీజీ వర్క్ ఇంకా పూర్తి కాలేదు.  అందుకే ఈ దీపావళికి అప్డేట్ ఇవ్వలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. ఇది ఫ్యాన్స్ కి కొంచెం నిరాశే అని చెప్పుకోవచ్చు.  కానీ నవంబర్ రెండో వారం లోపు దానిని విడుదల చేస్తామని మరో క్లారిటీ ఇచ్చారు. సో  టైటిల్‌ కోసం మరి కొన్ని రోజులు ఆగాల్సిందే అని తెలుస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles