టైటిల్‌ కుదిరింది!

Saturday, March 29, 2025

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసగా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘హిట్-3’ మూవీతో బిజీగా ఉన్న నాని, తన నెక్స్ట్ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. వీరిద్దరి కాంబోలో గతంలో ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం కూడా వచ్చింది.

అయితే, ఈసారి అంతకు మించిన సినిమాతో రావాలని వీరిద్దరు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలుపెట్టుకున్న ఈ సినిమా కోసం చిత్ర బృందం ఓ సాలిడ్ టైటిల్‌ ను ఖరారు చేసి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఈ సినిమాకి  ‘ది పారడైస్’ అనే టైటిల్‌ను చిత్ర బృందం ప్రకటించింది. దసరా చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను కూడా మరోసారి సమర్పిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles