యంగ్ హీరో తేజా సజ్జ ‘హను-మాన్’ మూవీతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అతను నటిస్తున్న కొత్త సినిమా ‘మిరాయ్’ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తేజా ఒక సూపర్ యోధా పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చేశాయి. తాజాగా సినిమా టీమ్ మిరాయ్ టీజర్ రిలీజ్ కు సన్నాహాలు పూర్తి చేసుకుంది. మిరాయ్ టీజర్ ను మే 28వ తేదీ ఉదయం 10:08 గంటలకు విడుదల చేస్తామని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఇక ఈ సినిమాలో మరో హైలైట్ మంచు మనోజ్. అతను ఈ సినిమాలో ప్రధాన విలన్ గా కనిపిస్తాడు. మనోజ్ పాత్ర చాలా పవర్‌ఫుల్ గా ఉంటుందని, ఆ పాత్రలో అతను అందరిని ఆశ్చర్యపరిచడం ఖాయమని టీమ్ చెబుతోంది. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది.
‘మిరాయ్’ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్ పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. టీజర్ రాగానే ఇంకెంత హైప్ వస్తుందో చూడాలి.
