మెగా ఈవెంట్ కి ముహుర్తం కుదిరింది! టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా ఇపుడు చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమానే “లైలా”. కొత్త డైరెక్టర్ రామ్ నారాయణ్ తెరకెక్కించిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ డ్యూయల్ షేడ్స్ లో నటిస్తుండగా ఆల్రెడీ వచ్చిన టీజర్, ట్రైలర్ లు మంచి ఆదరణ పొందాయి.
అయితే ఈ సినిమా కోసం తాజా గానే విశ్వక్ , నిర్మాత సాహు గారపాటి ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించడానికి వెళ్లిన విషయం తెలిసిందే. మరి ఈ మెగా లైలా ఈవెంట్ కి ఇపుడు తేదీ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
ఈ ఈవెంట్ ని ఈ ఫిబ్రవరి 9న చేస్తున్నట్టుగా విశ్వక్ రివీల్ చేసాడు. దీంతో మాస్ కా దాస్ తో బాస్ ఆఫ్ మాసెస్ ఒకే స్టేజి మీద కనిపించనున్నారని చెప్పాలి. ఇక ఈ ఈవెంట్ కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.