లైలా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముహుర్తం కుదిరింది!

Tuesday, April 1, 2025

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లైలా’ ఫిబ్రవరి 14న గ్రాండ్ విడుదలకు సిద్దం అవుతుంది. ఈ సినిమాను రామ్ నారాయణ్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో విశ్వక్ తొలిసారి ఓ లేడీ గెటప్‌లో నటిస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఈ మూవీ పై అంచనాలను భారీగా పెంచాయి.అయితే, తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేసేందుకు మేకర్స్ డేట్, టైమ్ ఫిక్స్ చేశారు. జనవరి 6న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను AAA సినిమాస్‌లో నిర్వహించనున్నారు.

ఈ సినిమాలో విశ్వక్ తన రెండు పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం గ్యారంటీ అని  చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles