సింబ రాకకు ముహూర్తం ఖరారైంది! I

Sunday, December 22, 2024

దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘హను-మాన్’ సినిమాతో ఎలాంటి క్రేజ్‌ను సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఆయన ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ పక్కన సెటిల్‌ అయిపోయాడు. ఇక ఈ డైరెక్టర్ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేసి అందరిలో మరో ఆసక్తిని పెట్టాడు. ‘సింబ’ అనే సినిమాతో ప్రశాంత్ వర్మ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తాజాగా ప్రకటించాడు.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే ఈ సినిమా కూడా ఉండబోతుందని ఆయన ప్రకటించాడు. ఇక ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా టాక్ బాగా వినిపిస్తోంది. అయితే, దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ సెప్టెంబర్ 6న ఉదయం 10.36 గంటలకు చేయబోతున్నట్లు ప్రశాంత్ వర్మ తాజాగా ప్రకటించారు. అంతేగాక, ‘‘లెగసీని ముందుకు తీసుకెళ్లే సమయం ఆసన్నమైంది’’ అంటూ ప్రశాంత్ వర్మ ఓ క్లూ కూడా ఇచ్చాడు.

దీంతో ఈ సినిమాలో మోక్షజ్ఞ తెరంగేట్రం దాదాపు ఖాయం అని నందమూరి అభిమానులు  అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles