చెమటలు చిందిస్తున్న త్రీ తేజ్ లు! మెగా అభిమానులు తమ అభిమాన హీరోల నుంచి సాలిడ్ హిట్ కోసం వారంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి వచ్చిన గేమ్ ఛేంజర్ అలాగే గతేడాది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుంచి వచ్చిన మట్కా సినిమాలు డిజప్పాయింట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే సాయి దుర్గ తేజ్ కూడా తన బ్రో సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. అయితే ఇపుడు ఈ ముగ్గురు యంగ్ హీరోలు కూడా జిమ్ లో చెమటోడుస్తూ కనిపిస్తున్నారు. తాజాగా సాయి తేజ్ ఫోటోని ముగ్గురుతో షేర్ చేసుకున్నాడు. మధ్యలో రామ్ చరణ్ తేజ్ తన RC 16 లుక్ లో కనిపిస్తుండగా వెనుక సాయి తేజ్, వరుణ్ తేజ్ లు హ్యాపీ మూమెంట్స్ తో కనపడుతున్నారు. దీంతో ఈ పిక్ ఇపుడు వైరల్ గా మారింది. ఇక ఈ ముగ్గురు కూడా ప్రస్తుతం పలు భారీ సినిమాల్లో బిజీగా ఉండగా ఇవన్నీ షూటింగ్ దశలో ప్రస్తుతం కొనసాగుతున్నాయి.