కత్తి నేనే… నెత్తురు నాదే…యుద్ధం నాతోనే..అదిరిపోయే రౌడీ హీరో సినిమా అప్డేట్‌!

Wednesday, January 22, 2025

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ గత కొంత కాలం నుంచి వరుస అపజయాలను చవి చూస్తున్నప్పటికీ వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. తాజాగా విజయ్‌ నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్‌ , స్టార్‌ ప్రొడ్యూసర్‌ నిర్మించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల మధ్యకు వచ్చినప్పటికీ ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది.

థియేటర్లలో నెగిటివ్‌ టాక్‌ ను అందుకున్న ఈ సినిమా ఓటీటీలో మాత్రం దూసుకుపోతుంది. ప్రస్తుతం విజయ్‌ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌ లో  ఓ స్పై పీరియాడిక్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా విజయ్ దేవరకొండ తన తరువాత సినిమాను ప్రకటించారు. మరోసారి దిల్ రాజు నిర్మాణంలో  విజయ్ సినిమా చేస్తున్నాడు. రాజావారు రాణిగారు సినిమా దర్శకుడు రవి కిరణ్ కోలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

రీసెంట్ ఈ సినిమాను చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. రూరల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండనుందని వారు తెలిపారు. అయితే విజయ్ దేవరకొండ తో హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా మరో సినిమా చేస్తానని దిల్ రాజు తెలిపారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న రవి కిరణ్ కోలాకు అవకాశం ఇచ్చి అందరిని ఆశ్చర్య పరిచారు. ఇదిలా ఉంటే గురువారం  విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

చెప్పినట్లుగానే మేకర్స్ ఒక పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో కత్తి నేనే..నెత్తురు నాడే ..యుద్ధం నాతోనే ..అంటూ కత్తి పట్టుకున్న లుక్ సూపర్ ఉంది. ఈ సారి పక్కా మాస్ కథతో విజయ్ సినిమా ఉండనుందని ఈ పోస్టర్ చూస్తేనే తెలుస్తుంది. సినిమా దిల్ రాజు బ్యానర్ లో 59 వ సినిమాగా వస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles