బలమైన జంతువు సింహమే.. కానీ ప్రమాదమైన జంతువు తోడేలు…ఆసక్తి రేపుతున్న’రాయన్’ ట్రైలర్!

Friday, December 5, 2025

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధానపాత్ర లో నటించిన తాజా చిత్రం ‘రాయన్’. ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్ప ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్ర పోషించినట్లు సమాచారం. ధనుష్ కు ఇది 50 వ సినిమా కావడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా చిత్ర ట్రైలర్ ను మూవీ మేకర్స్‌ విడుదల చేశారు.

ఈ ట్రైలర్ లో ధనుష్ డిఫెరెంట్ మేకోవర్ తో తన నట విశ్వరూపం చూపించాడు. ఈ సినిమా కంప్లీట్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని ట్రైలర్ తోనే తెలిసిపోతుంది. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. రాయన్‌ అడవిలో ప్రమాదమైన జంతువేంటో తెలుసా..? అడవిలో బలమైన జంతువు సింహమే.. కానీ ప్రమాదకరమైన జంతువు తోడేలు.. అంటూ సెల్వ రాఘవన్‌ డైలాగ్స్‌తో ట్రైలర్‌ మొదలవుతుంది.

అనంతరం ధనుష్ మాస్ ఎంట్రీ సినిమాకే హైలైట్ గా నిలిచింది. నార్త్ మద్రాస్‌ బ్యాక్ డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. డార్క్ థీమ్ తో ఉండే విజువల్స్, యాక్షన్ సీన్స్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేశాయి. AR రెహమాన్ బీజీయం ట్రైలర్ ను మరింత ఎలివేట్ చేసింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles